సచిన్ పైలట్‌ వర్గానికి ఊరట..

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి , రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగాడనే నేపథ్యంలో సచిన్ పైలట్‌ను పీసీసీ, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా, పైలట్‌ను సపోర్టు చేస్తున్న.. ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ సీపీ జోషి ద్వారా నోటీసులు ఇప్పించింది. అయితే, దీనిపై రాజస్థాన్ హైకోర్టు స్టే ఇవ్వడంతో పైలట్ వర్గానికి కొంత ఉపశమనం […]

Update: 2020-07-17 07:05 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి , రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగాడనే నేపథ్యంలో సచిన్ పైలట్‌ను పీసీసీ, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా, పైలట్‌ను సపోర్టు చేస్తున్న.. ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ సీపీ జోషి ద్వారా నోటీసులు ఇప్పించింది. అయితే, దీనిపై రాజస్థాన్ హైకోర్టు స్టే ఇవ్వడంతో పైలట్ వర్గానికి కొంత ఉపశమనం లభించింది. స్పీకర్ జోషి ఇచ్చిన పార్టీ ఫిరాయింపుల నోటీసులపై ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. జూలై 21వరకు నోటీసులను నిలిపివేయాలని శుక్రవారం కోర్టు ఆదేశించింది. అసమ్మతి వ్యక్తం చేయడం పార్టీ ఫిరాయించడం ఒకటి కాదని సచిన్ పైలట్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టులో వాదనలు వినిపించారు. సీఎం అశోక్ గెహ్లాట్ నియంతృత్వ వైఖరిపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని.. రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన నోటీసులను రద్దుచేయాలని హరీశ్ సాల్వే కోర్టును కోరారు. కాగా, కోర్టు తీర్పు సచిన్ వర్గానికి ఫేవర్ గా వస్తుందా.. రాజస్థాన్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News