వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌తో వలస కార్మికులు, విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తారన్న వార్తలు రావడం, అందుకు బలాన్ని చేకూర్చే విధంగా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక రైళ్లు నడపాలని గెహ్లాట్ […]
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌తో వలస కార్మికులు, విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తారన్న వార్తలు రావడం, అందుకు బలాన్ని చేకూర్చే విధంగా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక రైళ్లు నడపాలని గెహ్లాట్ కోరారు. స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కోరామని సీఎం తెలిపారు. దాదాపు 6.3 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.
Tags: rajasthan cm, ashok Gehlot, letter, pm modi, trains, migrant workers