అశోక్ గెహ్లాట్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఓ వైపు అసెంబ్లీ స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ.. హౌకోర్టులో సచిన్ పైలట్ వేసిన పిటిషన్ విచారణ జరుగుతన్న సమయంలో అశోక్ గెహ్లాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, సచిన్ పైలట్ ఆరు నెలల ముందు నుంచే కుట్రలు పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సంస్థలు, బీజేపీ నుంచి అతనికి నిధులు సమకూరుస్తున్నాయని తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఓ వైపు అసెంబ్లీ స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ.. హౌకోర్టులో సచిన్ పైలట్ వేసిన పిటిషన్ విచారణ జరుగుతన్న సమయంలో అశోక్ గెహ్లాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, సచిన్ పైలట్ ఆరు నెలల ముందు నుంచే కుట్రలు పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సంస్థలు, బీజేపీ నుంచి అతనికి నిధులు సమకూరుస్తున్నాయని తెలిపారు. కానీ, వారి కుట్రలను విఫలం చేశామన్నారు. హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వంటి కార్పొరేట్ న్యాయవాదుల ఫీజును ఎవరు చెల్లిస్తున్నారని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. కూరగాయాలు అమ్ముకోడానికి రాలేదని.. తాను రాష్ట్ర సీఎంని అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.