ఐటీ అభివృద్ధిపై ఎమ్మెల్యేలకు చెత్త పేపర్లు.. కేటీఆర్‌పై రాజా సింగ్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలందరికీ చెత్త పేపర్లు పంపిణీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్ మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగం అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ పై తండ్రీకొడుకులు చెరొక మాట మాట్లాడటం […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలందరికీ చెత్త పేపర్లు పంపిణీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్ మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగం అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ పై తండ్రీకొడుకులు చెరొక మాట మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
చేతకాకనే కేసీఆర్, కేటీఆర్ కేంద్రాన్ని విమర్శించటం అలవాటుగా పెట్టుకున్నారన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్రం తెరిపించటాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మహిళలు, బాలికల భద్రతపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, డాటర్స్ డే రోజే అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో హోంమంత్రి రబ్బరు స్టాంపులాగా మారారని, హోంశాఖను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణలో క్రైం రేట్ విపరీతంగా పెరిగిందన్నారు. బయటకు వెళ్లిన మహిళలు భద్రంగా ఇంటికి తిరిగి వస్తామన్న భరోసా కరవువైందని ఆయన పేర్కొన్నారు.