గీతా ఆర్ట్స్‌తో రాజశేఖర్.. ఏమా కథ ?
పలాస 1978.. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పలాస మార్కెట్ గొడవల నేపథ్యంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను చూసిన నిర్మాత అల్లు అరవింద్.. దర్శకుడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. వెంటనే తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చిన అరవింద్.. భవిష్యత్‌లో గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వచనం గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కరుణ కుమార్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్లో […]
పలాస 1978.. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పలాస మార్కెట్ గొడవల నేపథ్యంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను చూసిన నిర్మాత అల్లు అరవింద్.. దర్శకుడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. వెంటనే తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చిన అరవింద్.. భవిష్యత్‌లో గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలని ఆశీర్వదించాడు.
ఆయన ఆశీర్వచనం గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కరుణ కుమార్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కే చాన్స్ ఉందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో రాజశేఖర్ హీరోగా నటించబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా చేయడంలో అల్లు అరవింద్ ప్రధాన ఉద్దేశం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్‌లను దగ్గర చేయడమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవ కారణంగా చిరు, రాజశేఖర్ల మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.
కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా వచ్చిందంటే దాదాపు సూపర్ హిట్ అనే బ్రాండ్ పడిపోయింది. మరి ఈ చిత్రంతో రాజశేఖర్ హిట్ కొడతాడా లేదా చూడాలి.