తెలుగు రాష్ట్రాలకు తప్పని వరుణ గండం
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ ఘడ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడునున్నదని, ఈ ప్రభావంతో బుధవారం కూడా వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది.
ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ ఘడ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడునున్నదని, ఈ ప్రభావంతో బుధవారం కూడా వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో 19న ఏర్పడే అల్పపీడనం 24 గంటల్లో బలపడి పశ్చిమ దిశగా పయనించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది.