తెలుగురాష్ట్రాలకు రెండ్రోజులపాటు వర్ష సూచన
దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలుపడే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాకుండా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో బయట తిరగడం ప్రమాదం అని సూచించింది.