తెలంగాణకు వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో నిన్న రాత్రి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. అత్యధికంగా ములుగు జిల్లా కాశిందేవిపేటలో నిన్న 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలోఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, తెలంగాణపై రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దీని వలన కాస్త వర్షాపాతం తక్కువగా ఉందన్నారు.  అలాగే, ఉత్తర భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు […]

Update: 2021-08-07 23:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో నిన్న రాత్రి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. అత్యధికంగా ములుగు జిల్లా కాశిందేవిపేటలో నిన్న 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలోఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, తెలంగాణపై రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దీని వలన కాస్త వర్షాపాతం తక్కువగా ఉందన్నారు. అలాగే, ఉత్తర భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News