సోనియాగాంధీకి రైల్వే యూనియన్ లేఖ

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు రైల్వే శాఖ నడిపిస్తున్న శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలపై ‘రాజకీయాల’కు పాల్పడవద్దని ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎఫ్) గురువారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరింది. ఈ మేరకు సోనియాకు రాసిన లేఖలో స్టేషన్లలో రద్దీని నివారించేందుకే రైల్వేలు డబ్బులు వసూలు చేస్తున్నాయని చెప్పింది. ‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమైనా కూడా రైల్వే సిబ్బంది తమ హార్డ్ […]

Update: 2020-05-07 06:55 GMT

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు రైల్వే శాఖ నడిపిస్తున్న శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలపై ‘రాజకీయాల’కు పాల్పడవద్దని ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎఫ్) గురువారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరింది. ఈ మేరకు సోనియాకు రాసిన లేఖలో స్టేషన్లలో రద్దీని నివారించేందుకే రైల్వేలు డబ్బులు వసూలు చేస్తున్నాయని చెప్పింది. ‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమైనా కూడా రైల్వే సిబ్బంది తమ హార్డ్ వర్క్‌తోనే దీన్ని సాధ్యం చేశారని’ యూనియన్‌కు చెందిన కార్మికులు సదరు లేఖలో పేర్కొన్నారు. 115 రైళ్ల ద్వారా వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేస్తున్న ఉత్తమ వ్యవస్థను రాజకీయ లబ్ది కోసం అస్థిరపరచొద్దని ఏఐఆర్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ శివ గోపాల్ మిశ్రా సదరు లేఖలో సోనియా గాంధీని కోరారు.

మే 1వ తేదీ నుంచి రైల్వే వలసకార్మికుల కోసం రైళ్లను నడుపుతుండగా.. వారి వద్ద నుంచి ప్రభుత్వం చార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా వారి చార్జీలను కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని సోనియా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, రైల్వే .. బుధవారం వరకు 140 శ్రామిక్ రైళ్లలో 1.35 లక్షల మంది కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేర్చింది.

Tags: Sonia Gandhi, Railway, AIRF, congress, Migrant workers, Shramik trains

Tags:    

Similar News