తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్..?

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా తదుపరి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమించబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం త్వరలో ముగియనున్నది. అతడి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ టాప్ బాస్‌లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన […]

Update: 2021-07-02 11:46 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా తదుపరి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమించబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం త్వరలో ముగియనున్నది. అతడి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ టాప్ బాస్‌లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన ద్రవిడ్.. ఆ తర్వాత అండర్-19, టీమ్ ఇండియా-ఏ కోచ్‌గా పని చేశాడు.

ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఉన్న అనేక మంది యువ క్రికెటర్లకు ద్రవిడే గురువుగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ద్రవిడ్‌ను కోచ్‌గా చేయాలని ఆలోచన ఉండబట్టే అతడిని శ్రీలంక పర్యటనకు కూడా పంపించినట్లు తెలుస్తున్నది. రవిశాస్త్రి పదవిని భర్తీ చేసే సరైన వ్యక్తి ద్రవిడే అని మాజీ క్రికెటర్ రితీందర్ సోది అన్నాడు. జట్టుతో కలసి ద్రవిడ్ వెళ్లడమే అతడు కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు సంకేతమని సోది అన్నాడు. ద్రవిడ్ వంటి క్రీడాకారుడు తాత్కాలిక పదవులకే పరిమితం కావొద్దని సోది చెప్పాడు.

Tags:    

Similar News