ఊకో కాక..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఏ ఊకో కాక…. ఈ పదం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది నోళ్లలో నానుతుంటుంది.. నలుగురు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ల మాటలకు విసిగెత్తిన వారు ‘ఏ ఊకో కాక మస్తు చెప్తున్నవ్’ అని గేలి చేస్తుంటారు. అయితే ఈ పదమే ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందంటే నమ్ముతారా? ఊకో కాక పేరిట ఏకంగా షాపులు కూడా ఓపెన్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ నిజమే. […]

Update: 2021-01-10 08:51 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఏ ఊకో కాక…. ఈ పదం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది నోళ్లలో నానుతుంటుంది.. నలుగురు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ల మాటలకు విసిగెత్తిన వారు ‘ఏ ఊకో కాక మస్తు చెప్తున్నవ్’ అని గేలి చేస్తుంటారు. అయితే ఈ పదమే ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందంటే నమ్ముతారా? ఊకో కాక పేరిట ఏకంగా షాపులు కూడా ఓపెన్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ నిజమే. ఇప్పుడు ఆ పదాన్నే తన వ్యాపారానికి పెట్టుకున్నారు రాహుల్ సిప్లిగంజ్.

దీనిని సెలెక్ట్ చేయడమే కాకుండా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ ‘ఊకో కాక ‘ పేరిట మెన్స్ వేర్ వ్యాపారం ప్రారంభించారు. మొట్టమొదటి షోరూంను శనివారం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరో ఆరు షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జనరల్ గా బ్రాండ్ పేరు పెట్టడానికి చాలా మంది వ్యాపారులు ఇంటర్నేషనల్ లెవల్లో ఆలోచించి సెలెక్ట్ చేస్తారు. అయితే రాహుల్ సిప్లి గంజ్ మాత్రం తెలంగాణ జనం నోళ్లలో ఎక్కవగా వాడుకలో ఉండే పదాన్ని ఎంచుకోవడం విశేషం.

Tags:    

Similar News