ఇవే ప్రధాని మోడీ విధ్వంసాలు : రాహుల్

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎన్డీఏ పాలనలో ‘మోడీ చేసిన విధ్వంసాలు’ అంటూ ట్విట్టర్‌లో ఆయన ఒక లిస్ట్ పెట్టారు. దేశ చరిత్రలో GDP అత్యల్ప స్థాయికి (-23)కు పడిపోయిందన్నారు. గత 45ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగం, 12కోట్ల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయని ధ్వజమెత్తారు. అంతేకాకుండా రాష్ట్రాలకు GST వాటా తగ్గించారని, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మన దేశంలోనే […]

Update: 2020-09-02 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎన్డీఏ పాలనలో ‘మోడీ చేసిన విధ్వంసాలు’ అంటూ ట్విట్టర్‌లో ఆయన ఒక లిస్ట్ పెట్టారు. దేశ చరిత్రలో GDP అత్యల్ప స్థాయికి (-23)కు పడిపోయిందన్నారు. గత 45ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగం, 12కోట్ల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా రాష్ట్రాలకు GST వాటా తగ్గించారని, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మన దేశంలోనే కరోనా కేసుల్లో పెరుగుదల, మరణాలు సంభవిస్తున్నాయని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆక్రమణలు పెరిగిపోతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు.

Tags:    

Similar News