NEET-JEE పై ఆమోదయోగ్య నిర్ణయం కావాలి : రాహుల్

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో NEET-JEE ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, విద్యార్థులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ -19 నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. NEET-JEE aspirants are worried about their health & future. They have genuine concerns of:– fear of Covid19 […]

Update: 2020-08-26 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో NEET-JEE ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, విద్యార్థులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ -19 నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ NEET-JEE పరీక్షలపై అందరికీ అయోదయోగ్యమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాలని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని వివరించారు.

‘ముఖ్యంగా వారి ఆరోగ్యం మరియు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని.. అదే సమయంలో కరోనా వ్యాప్తి.. రవాణా మరియు లాడ్జింగ్.. మరోవైపు అస్సాం, బీహార్‌ రాష్ట్రాల్లో వరదల బీభత్సం’ వీటన్నింటిని కేంద్రం దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (GOI) అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని రాహుల్ ట్విట్టర్ ద్వారా సూచించారు.

Tags:    

Similar News