మళ్లీ వారికే పగ్గాలు ఇవ్వడమేంటి?.. ‘భూభారతి’పై MLA కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

భూభారతి(Bhu Bharathi) అమలుపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-20 04:22 GMT
మళ్లీ వారికే పగ్గాలు ఇవ్వడమేంటి?.. ‘భూభారతి’పై MLA కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భూభారతి(Bhu Bharathi) అమలుపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరణితో తప్పు చేసిన అధికారుల చేతికే మళ్లీ భూభారతి అధికారులు కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. దీని వల్ల బాధితుల సమస్యలు తీరవు అని అన్నారు. వాళ్ల తప్పును ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. భూభారతి సక్రమంగా అమలు జరగాలంటే ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్ రావాలని అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆన్‌లైన్‌లో నమోదు కావాలని అన్నారు. ఈ ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు జనగామ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా అవినీతి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అన్నారు.

తాము ఎన్ని చెప్పినా పనిచేయాల్సింది అధికారులే అని.. అధికారులు సక్రమంగా పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. 10 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ పెండింగ్ సమస్యలన్నీ భూభారతి ద్వారా పరిష్కారం అవతాయనే నమ్మకం ఉందని అన్నారు. పేదరైతు కన్నీరు తుడవాలని రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని, ఇది రైతులకు గొప్ప వరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ధరణి నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని తయారు చేసిన చట్టమని.. ఇది పేద ప్రజలను రైతులను ఆదాలపాతాలానికి తొక్కిందని ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణి చట్టాన్ని బంగాళఖాతంలో కలిపి.. భూభారతిని తీసుకొచ్చారని అన్నారు.

Tags:    

Similar News