50వ వసంతంలోకి రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యకక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. కరోనా మహమ్మారి, సరిహద్దు ఘర్షణల కారణంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు. కానీ, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమ ప్రియతమ నేత పుట్టిన రోజు సందర్భంగా పేదలకు 50 లక్షల ఆహార పంపిణీ చేసినట్టు తెలిపాయి. అలాగే, పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణీ చేసినట్టు వివరించాయి. కాగా, గతేడాది మే నెలలో పార్టీ అధ్యక్ష పీఠం నుంచి […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యకక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. కరోనా మహమ్మారి, సరిహద్దు ఘర్షణల కారణంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు. కానీ, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమ ప్రియతమ నేత పుట్టిన రోజు సందర్భంగా పేదలకు 50 లక్షల ఆహార పంపిణీ చేసినట్టు తెలిపాయి. అలాగే, పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణీ చేసినట్టు వివరించాయి. కాగా, గతేడాది మే నెలలో పార్టీ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన రాహుల్ గాంధీ మళ్లీ ఆ బాధ్యతలు త్వరలోనే తీసుకునే అవకాశమున్నదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆయన తిరిగి పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేతపుచ్చుకునే అవకాశమున్నదని చెబుతున్నారు. యూత్ ఐకాన్‌గా, అవినీతి విధ్వంసకుడని పేరున్న రాహుల్ గాంధీ ఎన్నికల పోటీలో నెగ్గుకురాలేకపోయారు గానీ, ప్రభుత్వాన్ని షేక్ చేసే సత్తా ఉన్నదని పలుమార్లు నిరూపించుకున్నారు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని, ఇండియా అభివృద్ధికి జెన్యూన్‌గా కట్టుబడి ఉన్న మనిషి అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ప్రశంసించిన రాహుల్ గాంధీ మధ్యస్థ లేదా వామపక్ష రాజకీయ, ఆర్థిక ఆలోచనా విధానాలు కలిగి ఉన్నారని విమర్శకులు భావిస్తుంటారు.