బిగ్ న్యూస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ..!
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి పదవి కాలం ముగియనుండడంతో ఆ బాధ్యతలు రాహుల్‌కు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. గతంలో ఈ పదవిపై అంతగా ఆసక్తి చూపని ద్రావిడ్.. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జై షా సుధీర్ఘ చర్చలు జరపగా.. అందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి పదవి కాలం ముగియనుండడంతో ఆ బాధ్యతలు రాహుల్‌కు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. గతంలో ఈ పదవిపై అంతగా ఆసక్తి చూపని ద్రావిడ్.. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జై షా సుధీర్ఘ చర్చలు జరపగా.. అందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.
అయితే, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. గత ఆరేళ్లుగా ఇండియా ఏ, అండర్-19 జట్లకు ప్రాతినిత్యం వహిస్తున్న ద్రావిడ్.. రిషబ్ పంత్, అవేశ్ ఖాన్, పృథ్వీ షా, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను భారత జాతీయ జట్టుకు అందించాడు. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కూడా అతడు కొనసాగుతుండటం విశేషం. టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా అన్ని విధాలుగా అర్హుడని అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.