ఆ గ్యాంగ్ అవకాశాలను అడ్డుకుంటుంది : ఏఆర్ రెహమాన్
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో.. బాలీవుడ్‌లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంగనా, సోనూ నిగమ్, శేఖర్ కపూర్.. ఇలా చాలా మంది బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాలపై గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం.. బాలీవుడ్‌లో ఉన్న ఓ గ్యాంగే.. తనకు హిందీలో ఎక్కువ అవకాశాలు రాకుండా చేసిందని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. లేటెస్ట్‌గా రిలీజైన దిల్ బెచారా సినిమా విషయంలోనూ ఆ చిత్ర దర్శకుడు ముఖేష్ చాబ్రాకు […]
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో.. బాలీవుడ్‌లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంగనా, సోనూ నిగమ్, శేఖర్ కపూర్.. ఇలా చాలా మంది బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాలపై గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం.. బాలీవుడ్‌లో ఉన్న ఓ గ్యాంగే.. తనకు హిందీలో ఎక్కువ అవకాశాలు రాకుండా చేసిందని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.
లేటెస్ట్‌గా రిలీజైన దిల్ బెచారా సినిమా విషయంలోనూ ఆ చిత్ర దర్శకుడు ముఖేష్ చాబ్రాకు లేనిపోని భయాలు కల్పించినట్టు వెల్లడించారు. అవన్నీ పట్టించుకోకుండా నా దగ్గరికొచ్చిన ముఖేష్‌కు రెండు రోజుల్లోనే నాలుగు ట్యూన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ‘బాలీవుడ్‌లో చాలా మంది నాతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఓ గ్యాంగ్ వారిని అడ్డుకుంటోంది. ఈ క్రమంలో నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తున్నాను. నేను అందర్నీ స్వాగతిస్తున్నానని’ రెహమాన్ తెలిపారు. ‘పోయిన డబ్బులు తిరిగొస్తాయి.. కీర్తి కూడా తిరిగొస్తుంది. కానీ కోల్పోయిన విలువైన సమయం మాత్రం తిరిగి రాదు. శాంతిగా ముందుకు పోదాం. మనం చేయాల్సిన మంచి పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అని రెహమాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.