టీఆర్‌ఎస్ పతనం ఎంతో దూరం లేదు: రఘునందన్ రావు

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర రావు అవినీతి కేసుల్లో చిక్కుకొని తంటాలు పడుతుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు వేరు వేరు పార్టీలో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లారీ అసోసియేషన్ హాల్లో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. రఘునందన్ రావు సమక్షంలో పాల్వంచకు చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 500 […]

Update: 2021-08-10 08:18 GMT

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర రావు అవినీతి కేసుల్లో చిక్కుకొని తంటాలు పడుతుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు వేరు వేరు పార్టీలో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లారీ అసోసియేషన్ హాల్లో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. రఘునందన్ రావు సమక్షంలో పాల్వంచకు చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 500 మంది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యి రకరకాల కారణాలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నియంత పాలన కొనసాగుతుందని, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పాలనకు చరమగీతం పడాల్సిన రోజు ఎంతో దూరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పాలకులు అభివృద్ధిని పక్కకుపెట్టి భూ దందాలు, కుంభకోణాలు వంటి వ్యక్తిగత లాభం కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు. పోడుభూములకు పట్టాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హరితహారం, అడవులపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపెడితే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి అన్నారు. అవకాశాన్ని బట్టి పార్టీలు మారే ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలా అభివృద్ధి చెందుతుందని, ఈ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ పతనం మొదలైందని, త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్రం చెందుతుందని రఘునందన్ రావు అన్నారు.

Tags:    

Similar News