నిర్లక్ష్యం నీడలో చారిత్రక కోట

దిశ, సిరిసిల్ల: నాటి కాకతీయుల కళా వైభవం కాలగర్భంలో కలిసిపోతోంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని రాచర్ల కోట ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాకతీయుల పరిపాలనలో సాగిన రాచర్ల కోట కనుమరుగవుతోంది. అప్పటి కళాకారుల అద్భుత శిల్ప కళా సంపద అవశేషాలు కోటలో అక్కడక్కడా విసిరేసినట్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న రాచర్ల కోట నేడు నిర్లక్ష్యానికి గురై కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపునకు 20 కిలోమీటర్ల దూరం […]

Update: 2020-11-16 13:27 GMT

దిశ, సిరిసిల్ల: నాటి కాకతీయుల కళా వైభవం కాలగర్భంలో కలిసిపోతోంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని రాచర్ల కోట ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాకతీయుల పరిపాలనలో సాగిన రాచర్ల కోట కనుమరుగవుతోంది. అప్పటి కళాకారుల అద్భుత శిల్ప కళా సంపద అవశేషాలు కోటలో అక్కడక్కడా విసిరేసినట్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న రాచర్ల కోట నేడు నిర్లక్ష్యానికి గురై కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది.

సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపునకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. రాచర్ల, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల తిమ్మాపూర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల గుండారం గ్రామాలకు ఇంటి పేరులా ఓ చారిత్రక కోట పేరు ఇమిడిపోయి ఉంది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాచర్ల కోట నిర్మాణం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. రాచర్ల కోట పూర్తిగా కాకతీయుల సంస్కృ తిని ప్రతిబింబిస్తూ వరంగల్ లోని పలు నిర్మాణాలను తలపిస్తుంది. శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న రాచర్ల కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పురావస్తుశాఖ అధికారులు ఇటువైపు దృష్టి సారించకపోవడంతో విలువైన చారిత్రక వారసత్వ సంపద మట్టి పొరల్లో కూరుకుపోతుంది. మరోవైపు గుప్త నిధుల కోసం కోట చుట్టుపక్కల యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునేవారే లేకపోవడంతో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

శిల్పకళా కనుమరుగు..

రాచర్ల కోటలోని అద్భుత శిల్పకళ నేడు అంతరించి పోతోంది. సర్వాంగ సుందరంగా హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన శిల్పాలు అదృశ్యమవుతున్నాయి. కోటలోని రాతి కట్టడాలు, పురాతన విగ్రహాలు హైదరాబాద్‌ మ్యూజియానికి తరలించారు. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. పదిహేనేళ్ల క్రితం జక్కుల చెరువు ప్రాంతంలో గణపతి విగ్రహం లభ్యమైంది. దానిని కోట ప్రాంతంలో స్థానికులు ప్రతిష్టించారు. కోటలోని దేవుడి విగ్రహాలను వెలికితీసి కోట ప్రవేశం ముందు ఓ చోట ప్రతిష్టించారు. రాజుల పాలనలోని ఈ కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎంతో కాలం నుంచి నిధుల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

పూర్వపు చరిత్ర:

కోట మధ్యభాగంలో రాజుల భవనాలు, రాణుల మందిరాలు రాతిస్తంభాలు డంగు సున్నంతో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వాటి తాలూకు పునాదులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. రాళ్లపై పుష్పాలు, నృత్యకారిణుల బొమ్మలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కళాత్మక రాతి స్తంభాలు ఆలయాల్లో దర్శనమిస్తున్నాయి. భవనాలకు వాడిన రాళ్లపై చెక్కిన కళాత్మక శిలలు పూర్వపు చరిత్ర ఆధారంగా కనిపిస్తుంటాయి.

Tags:    

Similar News