కోహ్లీపై కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కెప్టెన్సీలో ఊహించని మార్పులు జరుగుతుండటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఓ సమయంలో బీసీసీఐ, గంగూలీ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ స్పందించక తప్పలేదు. ఇదిలా ఉండగా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టులో ఉండటం […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కెప్టెన్సీలో ఊహించని మార్పులు జరుగుతుండటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఓ సమయంలో బీసీసీఐ, గంగూలీ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ స్పందించక తప్పలేదు.
ఇదిలా ఉండగా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. భారత జట్టు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తన అద్భుత ఆటతీరుతో టీమ్‌ను ఆదుకున్నాడని వివరించాడు. అతని అనుభవం జట్టుకు చాలా అవసరమని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్‌లో 50 పరుగుల కంటే ఎక్కువ సగటు ఉండటం అంత సులభం కాదని కోహ్లీని ప్రశంసించాడు.
ఇదే సమయంలో తన భార్య రితికను సైతం హిట్ మ్యాన్ పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. తాను కెరీర్‌లో కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రితిక మద్దతుగా ఉందని కితాబు ఇచ్చాడు. తాను క్రికెటర్‌గా ఎదగడానికి ఎంతో సహకరించిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌పై ధ్యాస పెట్టేలా రితిక ఎంతో సహకరించిందని, ఇంటి పనులు కూడా తనే చూసుకునేదని రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.