ఖతార్‌లో ఏసియన్ టేబుల్ టెన్నిస్
దిశ, స్పోర్ట్స్ : ఏసియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ 2021ని ఖతార్‌లో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పురుషుల, మహిళల టోర్నీ నిర్వహించనున్నట్లు ఖతార్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మంగళవారం ప్రకటించింది. గతంలో ఈ చాంపియన్‌షిప్ నిర్వహణకు ఇండియా, చైనాలు బిడ్డింగ్ దాఖలు చేశాయి. కాగా, కరోనా నేపథ్యంలో ఇరు దేశాలు తాము ఈ మెగా టోర్నీ నిర్వహించలేమని బిడ్లు విరమించుకున్నాయి. దీంతో ఈ అవకాశం మరోసారి ఖతార్‌కు దక్కింది. 2000లో ఖతార్ రాజధాని దోహాలో ఏసియన్ […]
దిశ, స్పోర్ట్స్ : ఏసియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ 2021ని ఖతార్‌లో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పురుషుల, మహిళల టోర్నీ నిర్వహించనున్నట్లు ఖతార్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మంగళవారం ప్రకటించింది. గతంలో ఈ చాంపియన్‌షిప్ నిర్వహణకు ఇండియా, చైనాలు బిడ్డింగ్ దాఖలు చేశాయి.
కాగా, కరోనా నేపథ్యంలో ఇరు దేశాలు తాము ఈ మెగా టోర్నీ నిర్వహించలేమని బిడ్లు విరమించుకున్నాయి. దీంతో ఈ అవకాశం మరోసారి ఖతార్‌కు దక్కింది. 2000లో ఖతార్ రాజధాని దోహాలో ఏసియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. ‘ఖతార్‌లో మరోసారి మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రెండో సారి ఈ నిర్వహణ హక్కులు దక్కడం గర్వకారణం. ఐటీటీఎఫ్ జనరల్ అసెంబ్లీకి మా కృతజ్ఞతలు’ అని క్యూటీటీఏ అండ్ అరబ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.