BWF World Tour Finals: రెండో రౌండ్‌లోకి పీవీ సింధు

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021 రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-14, 21-16 తేడాతో లినీ క్రిస్టొఫర్‌సెన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-14, 21-16 తేడాతో తోమా జూనియర్ పొపోవ్‌పై సునాయాసంగా విజయం సాధించి రెండో రౌండ్‌లోకి […]

Update: 2021-12-01 11:57 GMT

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021 రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-14, 21-16 తేడాతో లినీ క్రిస్టొఫర్‌సెన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-14, 21-16 తేడాతో తోమా జూనియర్ పొపోవ్‌పై సునాయాసంగా విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

బీడ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆడుతున్న అతి చిన్న భారత షట్లర్ అయిన లక్ష్య సేన్‌ను అదృష్టం వరించింది. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి కెంటో మొమొటా గాయం కారణంగా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో లక్ష్యసేన్ రెండో రౌండ్ చేరుకున్నాడు. తొలి సారి ఈ బీడబ్ల్యూఎఫ్ ఫైనల్ టూర్‌కు అర్హత సాధించిన భారత పురుషుల జోడీగా రికార్డు సృష్టించిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ రాస్ముసీన్ జోడీపై 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప – సిక్కి రెడ్డి జోడి 14-21, 18-21 తేడాతో నమి మత్సుయామ – చిహారు షిదా జోడీపై ఓడిపోయారు.

Tags:    

Similar News