బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌లో ముగిసిన భారత షట్లర్ల ప్రస్థానం

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు 2021లో ఆశించిన మేరకు రాణించడం లేదు. కరోనా కారణంగా ఏడాది పాటు బ్యాడ్మింటన్ ఆటకు దూరంగా ఉండటంతో ఒక్కరు కూడా ఫామ్‌లో లేకుండా పోయారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్, టొయోటా థాయిలాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్‌ను ప్రభావితం చేసే బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో కూడా మన క్రీడాకారులు చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్‌లో పీవీ […]

Update: 2021-01-29 07:41 GMT

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు 2021లో ఆశించిన మేరకు రాణించడం లేదు. కరోనా కారణంగా ఏడాది పాటు బ్యాడ్మింటన్ ఆటకు దూరంగా ఉండటంతో ఒక్కరు కూడా ఫామ్‌లో లేకుండా పోయారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్, టొయోటా థాయిలాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్‌ను ప్రభావితం చేసే బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో కూడా మన క్రీడాకారులు చేతులెత్తేశారు.

మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు గురువారమే సెమీస్ పోరుకు అర్హత సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ కూడా సెమీస్ చేరలేకపోయారు. శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో పీవీ సింధు 21-18, 21-15తో థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీపై గెలిచింది. ఇక కిదాంబి శ్రీకాంత్ మాత్రం చివరి మ్యాచ్‌లోనూ ఓటమి పాలయ్యాడు. హాంకాంగ్‌కు చెందిన లాంగ్ అగ్నస్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-12, 18-21, 19-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ పోరాడినా ఫలితం మాత్రం దక్కలేదు.

Tags:    

Similar News