లాక్ డౌన్ పీరియడ్ కష్టమేమీ కాదు : పూరీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ పీరియడ్‌ను మరీ అంత దారుణంగా పరిగణించొద్దన్నారు దర్శకులు పూరీ జగన్నాథ్. ప్రపంచంలో ఉన్న మిగతా కష్టాలతో పోల్చుకుంటే అసలు ఇది కష్టమే కాదని .. మనం చాలా బాగున్నామన్నారు. ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు. సియాచిన్ మౌంటేన్‌లో భారత జవాన్లు విధుల్లో ఎంత కష్టపడుతున్నారో వివరించారు. మైనస్ 60 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో చలికి గడ్డకట్టుకుపోతున్నారని… కొన్ని సార్లు ఆ చలికి మన జవాన్ల […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ పీరియడ్‌ను మరీ అంత దారుణంగా పరిగణించొద్దన్నారు దర్శకులు పూరీ జగన్నాథ్. ప్రపంచంలో ఉన్న మిగతా కష్టాలతో పోల్చుకుంటే అసలు ఇది కష్టమే కాదని .. మనం చాలా బాగున్నామన్నారు. ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు. సియాచిన్ మౌంటేన్‌లో భారత జవాన్లు విధుల్లో ఎంత కష్టపడుతున్నారో వివరించారు. మైనస్ 60 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో చలికి గడ్డకట్టుకుపోతున్నారని… కొన్ని సార్లు ఆ చలికి మన జవాన్ల చేతులు, వేళ్లు, ముక్కు, చెవులు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంటుందని వివరించారు. మూడు పూటలా తిండి ఉండదు… కుటుంబీకులతో మాట్లాడే సౌకర్యం ఉండదు…. అయినా కూడా వారు మనకోసం అంత కష్టపడుతున్నప్పుడు… కనీసం మనం ఇళ్లలో ఉండలేమా అని ప్రశ్నించారు. భారతదేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనం రోడ్డు మీద అష్టకష్టాలు పడి బతుకుతున్నారు.. వారిని గుర్తు తెచ్చుకోండి.. అప్పుడైనా మీరు ఎంత స్వేచ్ఛగా, ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారో అర్ధమవుతుందన్నారు. సిరియా వార్, నైజీరియాలో బోకోహరాం టెర్రరిస్ట్ గ్రూప్ ఆగడాలు లాంటి అంశాలు ప్రస్తావిస్తూ .. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ టైం ముగుస్తుందని అనుకోవద్దని.. మే, జూన్ వరకు కూడా పొడిగించే చాన్స్ ఉందని తెలిపారు.