మేం విలువలతో పెరిగాం.. వైసీపీ నేతలకు పురందేశ్వరి కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి స్పందించారు. భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ… మేము ఎంతో విలువలతో పెరిగాం, వైసీపీ నేతల మాటలకు రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధపెట్టాయి. క్యారెక్టర్‌ను కించపరచడం దారుణమని అన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి స్పందించారు. భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ… మేము ఎంతో విలువలతో పెరిగాం, వైసీపీ నేతల మాటలకు రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధపెట్టాయి. క్యారెక్టర్‌ను కించపరచడం దారుణమని అన్నారు.
కాగా, ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసన తెలిపి, మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి.