కుప్పకూలిన కర్ణాటక.. సెమీస్‌లో పంజాబ్

దిశ, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ – 2021 నాకౌట్ దశకు చేరుకున్నది. అహ్మదాబాద్‌లోని సర్థార్ పటేల్ స్టేడియంలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకపై పంజాబ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పంజాబ్ బౌలర్ల ధాటికి కర్ణాటక బ్యాట్స్‌మెన్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 87 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఒక వికెట్ కోల్పోయి సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ […]

Update: 2021-01-26 10:13 GMT

దిశ, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ – 2021 నాకౌట్ దశకు చేరుకున్నది. అహ్మదాబాద్‌లోని సర్థార్ పటేల్ స్టేడియంలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకపై పంజాబ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పంజాబ్ బౌలర్ల ధాటికి కర్ణాటక బ్యాట్స్‌మెన్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 87 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఒక వికెట్ కోల్పోయి సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్‌లో కర్ణాటక నిర్దేశించిన 88 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ జట్టు అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ వర్మ (4) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. మిథున్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో ఓపెనర్ సిమ్రన్ సింగ్‌తో కలసి కెప్టెన్ మన్‌దీప్ సింగ్ ధాటిగా ఆడారు. సిమ్రన్ సింగ్ బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న మన్‌దీప్ కూడా అతడికి తోడ్పాటు ఇస్తూనే బౌండరీలు బాదాడు. సిమ్రన్ సింగ్ (49), మన్‌దీప్ సింగ్ (35) కలసి కేవలం 12.4 ఓవర్లలోనే 89 పరుగులు చేసి పంజాబ్ జట్టును సెమీస్‌లో చేర్చారు. మిథున్‌కు ఒక వికెట్ లభించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్, కరుణ్ నాయర్ ధాటిగానే బ్యాటింగ్ చేశారు. పడిక్కల్, కెప్టెన కరుణ్ నాయర్ వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించారు. తొలి వికెట్‌కు 24 పరుగులు జోడించారు. అయితే సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి కరుణ్ నాయర్ (12) గుర్‌కీరత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. సిద్దార్ద్ కౌల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (11) కూడా గుర్‌కీరత్ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పవన్ దేశ్ పాండే (0), బీఆర్ శరత్ (2) కూడా విఫలమయ్యారు. పడిక్కల్, పవన్, శరత్ ముగ్గురు కూడా కర్ణాటక స్కోర్ 26 వద్ద ఉన్నప్పుడే పెవీలియన్ చేరారు.

ఆ తర్వాత అనిరుద్ద జోషి (27), శ్రేయస్ గోపాల్ (13) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 25 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత శ్రేయస్ గోపాల్ (13) రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సిమ్రన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. సరైన తోడు లేకపోవడంతో అనిరుద్ద జోషి (27) మార్కండే బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత టెయిలెండర్లు క్యూ కట్టడంతో కర్ణాటక జట్టు 17.2 ఓవర్లలో కేవలం 87 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సిద్దార్థ్ కౌల్ 3 వికెట్లు తీయగా, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్, రమణ్‌దీప్‌సింగ్ తలా రెండు వికెట్లు, మర్కండే ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు

కర్ణాటక
దేవ్‌దత్ పడిక్కల్ (సి) గుర్‌కీరత్ సింగ్ (బి) సందీప్ కౌల్ 11, కరుణ నాయర్ (సి) గుర్‌కీరత్ సింగ్ (బి) సందీప్ శర్మ 12, బీఆర్ శరత్ (సి) అభిషేక్ శర్మ (బి) అర్షదీప్ సింగ్ 2, పవన్ దేశ్‌పాండే (సి) మార్కండే (బి) సిద్దార్థ్ కౌల్ 0, అనిరుద్ద జోషి (బి) మార్కండే 27, శ్రేయస్ గోపాల్ (సి) సిమ్రన్ సింగ్ (బి) రమణ్ దీప్ సింగ్ 13, జె సుచిత్ (సి) సిమ్రన్ సింగ్ (బి) రమణ్ దీప్ సింగ్ 8, పవన్ దూబే (బి) అర్షదీప్ సింగ్ 9, మిథున్ (సి) అండ్ (బి) సిద్దార్థ్ కౌల్ 2, వి. కౌషిక్ 0 నాటౌట్, ప్రసిద్ద్ (సి) అండ్ (బి) సందీప్ శర్మ 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (17.2 ఓవర్లు) 87 ఆలౌట్

వికెట్ల పతనం : 1-24, 2-26, 3-26, 4-26, 5-51, 6-72, 7-84, 8-86, 6-86, 10-87
బౌలింగ్ : సందీప్ శర్మ (2.2-0-17-2), అర్షదీప్ సింగ్ (3-0-16-2), సిద్దార్థ్ కౌల్ (4-1-15-3), హర్‌ప్రీత్ బ్రార్ (1-0-5-0), రమణ్ దీప్ సింగ్ (4-0-22-2), మార్కండే (3-0-12-1)

పంజాబ్
అభిషేక్ శర్మ (సి) దేవ్‌దత్ పడిక్కల్ (బి) మిథున్ 4, సిమ్రన్ సింగ్ 49 నాటౌట్, మన్‌దీప్సింగ్ 35 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12.4 ఓవర్లు) 89/1
వికెట్ల పతనం : 1-4
బౌలింగ్ : అభిమన్యు మిథున్ (2-0-11-1), ప్రసిద్ద్ కృష్ణ (3-0-17-0), వి. కౌశిక్ (2-0-17-0), శ్రేయస్ గోపాల్ (2.4-0-17-0), పవన్ దూబే (1-0-9-0), జగదీష సుచిత్ (2-0-12-0)

Tags:    

Similar News