వడ్డీ రేట్లు తగ్గించిన నేషనల్ బ్యాంక్!
దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) బుధవారం తన బెంచ్‌మార్క్ రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెపో ఆధారిత వడ్డీ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. తగ్గించిన వడ్డీ రేటు నవంబర్ 8న దీపావళి తర్వాత అమల్లోకి వస్తుందని పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రెపో ఆధారిత వడ్డీ రేటు తగ్గింపు ద్వారా ఖాతాదారులకు గృహ రుణాలు మొదలుకొని కారు, […]
దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) బుధవారం తన బెంచ్‌మార్క్ రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెపో ఆధారిత వడ్డీ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. తగ్గించిన వడ్డీ రేటు నవంబర్ 8న దీపావళి తర్వాత అమల్లోకి వస్తుందని పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
రెపో ఆధారిత వడ్డీ రేటు తగ్గింపు ద్వారా ఖాతాదారులకు గృహ రుణాలు మొదలుకొని కారు, విద్య, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రుణాలపై తక్కువ వడ్డీ ప్రయోజనాలు అందుతాయని బ్యాంకు వివరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు చివరిసారిగా సెప్టెంబర్ 17న ఈ ఆర్ఎల్ఎల్ఆర్‌ను 6.80 శాతం నుంచి 6.55 శాతానికి సవరించింది.
బుధవారం చేసిన ప్రకటన ప్రకారం.. ఈ నెల 8వ తేదీ నుంచి పీఎన్‌బీ కార్ల రుణాలను 6.65 శాతంతో తక్కువ వడ్డీతో అందిస్తుందని, గృహ రుణాలు 6.50 శాతం నుంచే ప్రారంభమవుతాయని, ఇవి మునుపెన్నడూ లేనంత తక్కువ వడ్డీతో ఇస్తున్న రుణాలని’ బ్యాంకు ఈ ప్రకటనలో పేర్కొంది. సవరించిన వడ్డీ రేట్లతో దేశంలో ఎలక్ట్రిక్(ఈవీ) వాహనాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
వీటికి మద్దతుగా పీఎన్‌బీ ఈవీ, సీఎన్‌జీ వాహనాలపై అతి తక్కువ 6.65 శాతం వడ్డీకే రుణాలను ఇవ్వనుంది. మిగిలిన వాహనాలపై 6.75 శాతంతో రుణాలను ఇస్తుంది. వ్యక్తిగత రుణాలను 8.90 శాతానికే ఇవ్వనుంది. అంతేకాకుండా వ్యక్తిగత రుణాలపై పరిమితిని 72 నెలల చెల్లింపుల వ్యవధితో రూ.20 లక్షలకు సవరించింది.