రాహుల్‌ను తప్పుదారి పట్టించిన పుదుచ్చేరి సీఎం..

న్యూఢిల్లీ : రాజకీయ సంక్షోభం, ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పుదుచ్చేరి రెండో రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. బుధవారం తొలిరోజు మత్స్యకారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎం నారాయణ స్వామిపై మత్స్యకార మహిళ ఒకరు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. నివార్ తుఫాన్ తర్వాత తమ కుటుంబాలను పరామర్శించడానికి సీఎం రాలేదని ఆమె ఆరోపించారు. అయితే, ఈ విషయాన్ని సీఎం నారాయణ స్వామి ఎంపీ రాహుల్ గాంధీకి తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. […]

Update: 2021-02-17 11:12 GMT

న్యూఢిల్లీ : రాజకీయ సంక్షోభం, ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పుదుచ్చేరి రెండో రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. బుధవారం తొలిరోజు మత్స్యకారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎం నారాయణ స్వామిపై మత్స్యకార మహిళ ఒకరు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. నివార్ తుఫాన్ తర్వాత తమ కుటుంబాలను పరామర్శించడానికి సీఎం రాలేదని ఆమె ఆరోపించారు.

అయితే, ఈ విషయాన్ని సీఎం నారాయణ స్వామి ఎంపీ రాహుల్ గాంధీకి తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. నివర్ తుఫాన్ సమయంలో నేను (సీఎం నారాయణ స్వామి) వచ్చానని, ఈ ప్రాంతాన్ని సందర్శించానని, వారికి తగిన సహాయసహకారాలు అందించానని ఆ మహిళ తెలుపుతున్నట్లుగా రాహుల్‌కు నారాయణ స్వామి ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేశారు.

Tags:    

Similar News