చౌటుప్పల్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.

దిశ,మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 18 వ వార్డ్ లో గత రెండు మూడు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో చౌటుప్పల్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్‌ ఫ్లూ తోనా లేక ఎవరైనా మందు పెట్టరా అని స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒకటి రెండు కోళ్లు చనిపోయాయనీ… మంగళవారం ఒక్క రోజే సుమారు 30 కోళ్లు చనిపోయాయని హనుమాన్‌నగర్‌కు చెందిన స్థానిక మహిళ […]

Update: 2021-01-13 11:54 GMT
చౌటుప్పల్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.
  • whatsapp icon

దిశ,మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 18 వ వార్డ్ లో గత రెండు మూడు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో చౌటుప్పల్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్‌ ఫ్లూ తోనా లేక ఎవరైనా మందు పెట్టరా అని స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒకటి రెండు కోళ్లు చనిపోయాయనీ… మంగళవారం ఒక్క రోజే సుమారు 30 కోళ్లు చనిపోయాయని హనుమాన్‌నగర్‌కు చెందిన స్థానిక మహిళ ఒకరు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక వెటర్నరీ వైద్యులు డాక్టర్ పృధ్విరాజ్, డాక్టర్ శ్రవణ్ చనిపోయిన కోళ్ళకు పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావొద్దని సూచించారు.

Tags:    

Similar News