Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాపు కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేసులో A6గా ఓ ప్రముఖ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్ రావు (Sravan Ran) ఇవాళ మరోసారి జూబ్లీహిల్స్ పీఎస్ (Jubilee Hills Police Station)లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే నిందితులు ప్రభాకర్‌రావు (Prabhakar Rao), ప్రణీత్‌రావు (Praneet Rao) తూచా తప్పకుండా అమలు చేశారని సిట్ అభియోగం మోపింది.
కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు మార్చి 29న ఎట్టకేలకు హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సిట్ అధికారుల నోటీసులు అందుకున్న ఆయన ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. అయితే, నేటి విచారణలో భాగంగా శ్రవణ్ రావు (Sravan Rao) సబ్మిట్ చేసిన రెండు ఫోన్లలోని డేటాను అధికారులు రికవర్ చేసే పనిలో ఉన్నారు. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు.. మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, శ్రవణ్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి.