కట్ చేసుకో, కారం పెట్టుకో, రక్తం కారుతుంటే వీడియో కాల్ చెయ్

దిశ,వెబ్‌డెస్క్: జనారణ్యంలో ముసుగేసుకున్న కొన్ని మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు కసితీరా కాటేస్తున్నాయి. ఈ అఘాయిత్యాల గురించి వింటుంటే.. తోటివారిని నమ్మాలంటే అమ్మాయిలకు వెన్నులో వణుకు పుట్టేస్తుంది. తల్లిదండ్రులకు.. కూతుళ్లను మానవ సమాజంలోకి పంపుతున్న ఫీలింగ్ రావట్లేదు. రాబందుల రాజ్యంలోకి.. రాకాసుల మూక మధ్య కి పంపుతున్న భయం కలుగుతోంది. మాదాపూర్ లో జరిగిన ఘటన […]

Update: 2021-01-02 02:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: జనారణ్యంలో ముసుగేసుకున్న కొన్ని మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు కసితీరా కాటేస్తున్నాయి. ఈ అఘాయిత్యాల గురించి వింటుంటే.. తోటివారిని నమ్మాలంటే అమ్మాయిలకు వెన్నులో వణుకు పుట్టేస్తుంది. తల్లిదండ్రులకు.. కూతుళ్లను మానవ సమాజంలోకి పంపుతున్న ఫీలింగ్ రావట్లేదు. రాబందుల రాజ్యంలోకి.. రాకాసుల మూక మధ్య కి పంపుతున్న భయం కలుగుతోంది. మాదాపూర్ లో జరిగిన ఘటన అంతటి భయంకరమైనది మరి.

ఈ ఘటనలో క్రూరత్వం ఎంత భయంకరంగా ఉందో సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ జరిగిన ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు.

ఆడది బయటకి వస్తే చాలు సందుల్లోనూ, ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ, నడిరోడ్డుపైనా ఇలా ఎక్కడ పడితే అక్కడ కామంతో నడిచే కొన్ని వేల కళ్ల మధ్య నడవాల్సి వస్తుంది. అందుకే మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్లు, మన కూతుళ్లు బయటకి వెళితే తిరిగొచ్చే వరకు భయం భయంగా ఉంటున్నాం. అలాంటి భయాందోళనల మధ్య ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోస్తున్నా.. ఒక్కోసారి అగంతకులు ఆడే చదరంగంలో బలవ్వాల్సి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి… చదువుల తల్లి. బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషించాలనే గంపెడాశలతో అక్కడి నుంచి హైదరాబాద్ మాదాపూర్‌కు వచ్చింది. మాదాపూర్ హాస్టల్ లో ఉంటూ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతుంది. అయితే ఓ రోజు ఆ యువతి వెళ్లిన ఇంటర్వ్యూకే.. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న ఓ యువకుడు సైతం అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూలో యువతికి జాబ్ వచ్చింది. కానీ యువకుడికి జాబ్ రాలేదు. అప్పుడే ఆ యువకుడు సదరు యువతి పై కన్నేశాడు. తెలివిగా రెజ్యుమ్ లో ఉన్న ఆమె నెంబర్ నోట్ చేసుకున్నాడు.

అలా ఓ రోజు యువతికి ఫోన్ చేశాడు. హలో నేను. మనం ఇంటర్వ్యూలో కలుసుకున్నాం కదా. ఎలా ఉన్నారు..? మీకు జాబ్ వచ్చిందా..? అట్నుంచి ఆ జాబ్ వచ్చింది. అయినా మీరు ఎవరు? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు. అయినా నాకు ఇలాంటివి నచ్చవ్ అంటూ ఫోన్ పెట్టేసింది. అయినా సరే యువకుడు మాత్రం యువతికి డైలీ ఫోన్ చేసి విసిగించేవాడు. ప్రేమించాలని వేధించేవాడు. కానీ యువతి, యువకుడితో స్నేహం చేసేందుకు, ప్రేమించేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇక ఇలాగైతే లాభం లేదనుకొని యువకుడు.. యువతి హాస్టల్ దగ్గరకు వెళ్లి ఆమెకు ఫోన్ చేశాడు.

హలో నేను. మీ హాస్టల్ ఎదురు కరెంట్ పోల్ ఉంది కదా..! ఆ ఉందంటూ యువతి గాబరపడుతూ అడిగింది. దీంతో యువకుడు నువ్వు నన్ను ప్రేమించాలి. లేదంటే ఆ కరెంట్ పోల్ తీగలు పట్టుకొని చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు. ఆ వద్దు వద్దు. నేను నిన్ను ప్రేమించలేను. ప్రేమంటే మా కుటుంబ సభ్యుల పరువు పోతుంది. మా ఊరిలో నాన్నకు మంచి పేరుంది. ఆ పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ స్నేహితురాలిగా ఉంటానంటూ సైకోని ఒప్పించింది. సరే సరేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆఫీస్ కు వెళుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు స్నేహితుల్లా మెలుగుతున్నారు. కాఫీ షాపులు, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. అదే సమయంలో ఇద్దరూ నార్మల్ గా పక్కపక్కన కూర్చొని ఉండగా యువకుడు రహస్యంగా ఫోటోలు తీస్తున్నాడు. పాపం ఆ విషయం యువతికి తెలియదు.

ఓ రోజు డైరక్ట్ గా యువతి ఆఫీస్ దగ్గరకు వెళ్లి నేను మీ ఆఫీస్ దగ్గరున్నా.. పక్కనే ఉన్న కెఫె దగ్గరికి రా అంటూ ఆర్డర్ వేశాడు. సరేనంటూ కెఫెకి వెళ్లింది. అప్పుడే యువకుడు తనలోని సైకోని నిద్రలేపాడు. మనిద్దరం దిగిన ఫోటోలు నాదగ్గర చాలా ఉన్నాయ్. నువ్వు నన్ను ప్రేమించాలి. లేదంటే ఈ ఫోటోల్ని నెట్ లో షేర్ చేస్తా. మీ అమ్మానాన్నలకు పంపిస్తానంటూ బెదిరించాడు. దీంతో కంగారు పడ్డ యువతి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి హాస్టల్ కు వెళ్లింది. రోజులు గడుస్తున్నాయి. నిందితుడి నుంచి యువతికి చిత్రహింసలకు ఎక్కువయ్యాయి. తట్టుకోలేక ఆఫీస్ లు మారుతుంది. హాస్టళ్లు మారుతుంది. అయినా సరే నిందితుడు బాధితురాలి అడ్రస్ కనుక్కొని మరీ వేధిస్తున్నాడు. నిందితుడు ఇంటర్వ్యూలకు వెళుతున్నా జాబ్ రాకపోవడంతో ఫోటోల్ని అడ్డంపెట్టుకొని మధ్యమధ్యలో ఆమె దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. రాను రాను ఆగడాలు ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకొని ఆమెను శారీరకంగా లొంగదీసుకునేంతలా.

ఈలోగా కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో హమ్మయ్యా అనుకుంటూ యువతి ఆంధ్రప్రదేశ్ లోని తన స్వగ్రామానికి వెళ్లింది. యువకుడు తన ఊరికి వెళ్లిపోయాడు. మధ్యమధ్యలో యువతికి ఫోన్ చేసి బెదిరించేవాడు. యువతి లాక్ డౌన్ పేరు చెప్పి తప్పించుకునేది. ఇలా రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ ముందు హింసించే వాడు. వేధించేవాడు. ఎంజాయ్ చేసేవాడు. కానీ లాక్ డౌన్ తో అవేమీ లేకపోవడంతో యువకుడికి పిచ్చెక్కిపోయేది. ఏం చేయాలో పాలుపోక వెర్రెత్తి పోయేది.

అయితే ఓ రోజు సైకో కొత్త ఎత్తుగడతో యువతికి మళ్లీ ఫోన్ చేశాడు. లాక్ డౌన్ కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా. నేను చెప్పినట్లు చేయి అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు టాస్క్ లు ఇచ్చినట్లు యువతికి టాస్క్ లు ఇచ్చేవాడు. నువ్వు నాకు వీడియో కాల్ చేయ్. నేను చూస్తుండగానే వక్షోజాలని, మర్మాంగాలని కట్ చేసుకుని, కారం పూసుకుని, రక్తం కారుతుంటే వీడియో కాల్ చేయ్ అంటూ హుకుం జారీ చేసేవాడు. లేదంటే ఫోటోల్ని బయటపెట్టి నీ కుటుంబాన్ని నడిరోడ్డుకీడుస్తానంటూ బెదిరించేవాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు కుటుంబసభ్యులకు తెలియకుండా సైకో చెప్పినవన్నీ చేసేది.

బాధితురాలి సోదరుడు సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకి బాధితురాలికి సైకో పెట్టే టార్చర్ ఎక్కువైంది. ఓ రోజుసైకో ఇచ్చే టాస్క్‌లు చేయలేక చివరికి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది.

అప్పుడే బాధితురాలి అన్నకి అనుమానం వచ్చింది. ఏంటీ చెల్లెలు ఇలా ఉంది. లాక్ డౌన్ తో ఇంటికి వచ్చిన తరువాత ఒకలా ఉంది. ఇప్పుడెందుకు ఇలా అయ్యిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. చివరికి ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏం జరుగుతుందో చెప్పాలంటూ అన్న… తన చెల్లెల్ని నిలదీశాడు. దీంతో బాధితురాలు గుండెల్లోని బాధని ఒక్కసారిగా వెళ్ల గక్కింది. తనకు జరిగిన దారుణాల్ని అన్నముందు ఏకరువు పెట్టింది. దీంతో చెల్లెల్ని ఓదార్చిన అన్న పరిష్కారం కోసం ఆలోచించాడు. మధ్య తరగతి కుటుంబంలో ఆడపిల్లలపై దారుణం జరిగితే సమాజం నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి చీత్కారాలు ఎదురవుతాయో మనకు తెలియంది కాదు. అన్నకూడా అదే అనుకున్నాడు. ఇక లాభం లేదనుకొని అన్న- చెల్లెలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యారు.

సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అన్న ఆత్మహత్య ఎలా చేసుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు. ఓ రోజు అన్న తాను కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న బిల్డింగ్ పైకి ఎక్కి… ఎక్కడి నుంచి దూకాలో? ఎక్కడి నుంచి దూకితే చనిపోతామో? అని టెస్ట్ లు చేస్తూ అటు ఇటూ తిరుగుతుండగా.. అనుమానం వ్యక్తం చేసిన సూపర్ వైజర్ ఎందుకు ఇలా అటు ఇటు తిరుగుతున్నావ్ అని ప్రశ్నించారు.

దీంతో సార్ నేను, మా చెల్లెలు ఇద్దరం చచ్చిపోవాలని అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి దూకితే ప్రాణాలు పోతాయో అని చూస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నావ్ అని గట్టిగా అడగడంతో చెల్లెలికి జరిగిన దారుణం గురించి చెప్పాడు. ఒక అన్నగా ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఈ పనిచేస్తున్నానంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

దీంతో ఆ సూపర్ వైజర్… బాధితురాలి అన్నకి షీ టీమ్స్ గురించి వివరించి, అన్నాచెల్లెళ్లకు ధైర్యం చెప్పి.. సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయకు విషయం తెలియజేశారు. ఆ సైకో పై బాధితురాలి నుండి కంప్లైంట్ తీసుకుని, రంగంలోకి దిగిన డీసీపీ అనసూయన కేసు గురించి సజ్జనార్ దృష్టికి తీసుకుని వెళ్లారు. సజ్జనార్ ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.

Tags:    

Similar News