జెడ్పీచైర్మన్‌కు చేదు అనుభవం.. ఎదురుతిగిరిన ఎంపీపీ
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు భూపాలపల్లి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జిల్లాలో రోడ్డు శంకుస్థాపన విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధును అక్కడ స్థానిక కాంగ్రెస్ ఎంపీపీ, కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల అధ్యక్షుడిగా ఉన్న తనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేని వివాదం చెలరేగింది. […]
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు భూపాలపల్లి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జిల్లాలో రోడ్డు శంకుస్థాపన విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధును అక్కడ స్థానిక కాంగ్రెస్ ఎంపీపీ, కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల అధ్యక్షుడిగా ఉన్న తనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేని వివాదం చెలరేగింది. దాంతో కాంగ్రెస్ ఎంపీపీ, కార్యకర్తలు పుట్ట మధు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మీ జిల్లా కాదు, మీ నియోజకవర్గం కాదు, మీరు కనీసం మా జిల్లా ప్రజాప్రతినిధి కూడా కాదు. అలాంటపుడు మీరేలా శంకుస్థాపన చేస్తారని మల్హర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలవ్వగా పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుమనిగేలా చేశారు.