ఎమ్మెల్యే vs మంత్రి..ప్రోటోకాల్ పంచాయితీ!
దిశప్రతినిధి, హైదరాబాద్ : బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పంచాయితీ వెలుగులోకి వచ్చింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రోటోకాల్ నిబంధనను ఉల్లంఘించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గురువారం నగర వ్యాప్తంగా 24 బస్తీ దవాఖానాలను పలువురు మంత్రులు, మేయర్ స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11గంటలకు మంగళ్ హాట్ డివిజన్ శివలాల్ నగర్‌లోని బస్తీ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించాలి. అయితే, మంత్రి రాకముందే […]
దిశప్రతినిధి, హైదరాబాద్ : బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పంచాయితీ వెలుగులోకి వచ్చింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రోటోకాల్ నిబంధనను ఉల్లంఘించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గురువారం నగర వ్యాప్తంగా 24 బస్తీ దవాఖానాలను పలువురు మంత్రులు, మేయర్ స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11గంటలకు మంగళ్ హాట్ డివిజన్ శివలాల్ నగర్‌లోని బస్తీ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించాలి. అయితే, మంత్రి రాకముందే ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో అక్కడికి చేరుకుని బస్తీ దవాఖాన రిబ్బన్ కత్తిరించి వెళ్లిపోయారు. ఈ సమయంలో మంగళ్ హాట్ టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త కూడా ఎమ్మెల్యే వెంట ఉండటం గమనార్హం. కాగా. బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారన్న విషయం తెలిసి మంత్రి తలసాని గోషా మహల్ పర్యటనను విరమించుకున్నారు.
మళ్లీ ప్రారంభించిన మేయర్..
మంగళ్‌హాట్ డివిజన్‌లో మంత్రి ప్రారంభించాల్సిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లిపోగా సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి చేరుకుని మరోమారు బస్తీ దవాఖానను ప్రారంభించి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.