మంత్రి మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ.. మరోసారి తప్పని చిక్కులు
దిశ ప్రతినిధి, మేడ్చల్/టౌన్: మేడ్చల్లో వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ ఎఫ్ ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేసామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు మంత్రి మల్లారెడ్డి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల తర్వాత తన యూనివర్సిటీలకు అనుమతులు తెచ్చుకున్నారు తప్ప .. డిగ్రీ కళాశాల […]
దిశ ప్రతినిధి, మేడ్చల్/టౌన్: మేడ్చల్లో వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ ఎఫ్ ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేసామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు మంత్రి మల్లారెడ్డి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల తర్వాత తన యూనివర్సిటీలకు అనుమతులు తెచ్చుకున్నారు తప్ప .. డిగ్రీ కళాశాల మాత్రం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో 3 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని, కానీ మేడ్చల్లో మాత్రం ఏర్పాటు చేయలేదన్నారు.
దీనికి మంత్రి మల్లారెడ్డి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో షామీర్పేట వెళ్ళే దారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
అటు దళిత బంధు కోసం మంత్రి మల్లారెడ్డి వెంటనే రాజీనామా చెయ్యాలని మేడ్చల్ జిల్లా దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం మేడ్చల్ జిల్లా బొడుప్పల్ పరిధిలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత బంధు కోసం మంత్రి మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు.
Follow Disha daily Facebook page :https://www.facebook.com/dishatelugunews