మొత్తం ఇవ్వాలని నిరసన

దిశ, నిజామాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాలు, పెన్షన్లలో కూడా కోత విధించాలని నిర్ణయించటాన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని అన్నారు. వరుసగా మూడో నెలలు కూడా కోతలు అమలు చేయటంవలన లక్షలాది కుటుంబాలు ఆర్థికఇ బ్బందులకులోనవుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించలేక పోవటమే ఈ […]

Update: 2020-06-01 00:44 GMT

దిశ, నిజామాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాలు, పెన్షన్లలో కూడా కోత విధించాలని నిర్ణయించటాన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని అన్నారు. వరుసగా మూడో నెలలు కూడా కోతలు అమలు చేయటంవలన లక్షలాది కుటుంబాలు ఆర్థికఇ బ్బందులకులోనవుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించలేక పోవటమే ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా మూడు నెలల వేతనాలు, పెన్షన్లలో కోత విధించటాన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీకాంత్, దేవిసింగ్, బాలయ్య, రమేష్, సాయిలు, శాంతన్, విజయ్ కుమార్, ధర్మేందర్, రాజన్న, సురేష్, సత్యానంద్, బోజన్న, సుశీల్ కుమార్, వెంకట్ రమణ, సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News