21న ప్రాప‌ర్టీ ట్యాక్స్ పరిష్కారాలు

దిశ, న్యూస్ బ్యూరో: ఈ నెల 21న ఉద‌యం 9:30గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారం గ్రీవెన్స్‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డిఎస్‌.లోకేష్ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌తి ఆదివారం ఈ గ్రీవెన్స్‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ ఈ నెల 22న ప్ర‌ధానమంత్రి జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపు ఇచ్చినందున శ‌నివారం రోజే ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జోన‌ల్, డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. ప్ర‌జ‌లు […]

Update: 2020-03-20 09:47 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ఈ నెల 21న ఉద‌యం 9:30గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారం గ్రీవెన్స్‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డిఎస్‌.లోకేష్ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌తి ఆదివారం ఈ గ్రీవెన్స్‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ ఈ నెల 22న ప్ర‌ధానమంత్రి జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపు ఇచ్చినందున శ‌నివారం రోజే ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జోన‌ల్, డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ప్రాప‌ర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన రివిజ‌న్ ఫిటీష‌న్లు, ట్యాక్స్ అసెస్‌మెంట్ త‌ప్పుల స‌వ‌ర‌ణ, ఏరియ‌ర్స్‌, కోర్టు కేసుల ప‌రిష్కారం, ఇత‌ర ట్యాక్స్ సంబంధిత అంశాల‌ను ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ప‌రిష్క‌రించుకునేందుకు వినియోగించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు.

Tags: Property tax fixes, 21st march, hyderabad, GHMC Commissioner DS Lokesh Kumar

Tags:    

Similar News