వాణిజ్య పన్నుశాఖలో 50 మందికి ప్రమోషన్
దిశ, తెలంగాణ బ్యూరో: వాణిజ్య పన్నుశాఖలో వివిధ క్యాడర్లలో 50 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జాయింట్ కమిషనర్ గా ఉన్న ఎస్.జయా కామేశ్వరి అడిషనల్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న ఐదుగురికి జాయింట్ కమిషనర్లుగా ప్రమోషన్ వచ్చింది. వారిలో జి.ద్వారాకాంత్ రెడ్డి, ఎన్.సాయికిషోర్, జి.ఫణీంద్రరెడ్డి, ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, వై.సునిత ఉన్నారు. వీరితో పాటు మరో 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి […]
దిశ, తెలంగాణ బ్యూరో: వాణిజ్య పన్నుశాఖలో వివిధ క్యాడర్లలో 50 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జాయింట్ కమిషనర్ గా ఉన్న ఎస్.జయా కామేశ్వరి అడిషనల్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న ఐదుగురికి జాయింట్ కమిషనర్లుగా ప్రమోషన్ వచ్చింది. వారిలో జి.ద్వారాకాంత్ రెడ్డి, ఎన్.సాయికిషోర్, జి.ఫణీంద్రరెడ్డి, ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, వై.సునిత ఉన్నారు. వీరితో పాటు మరో 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. ప్రమోషన్ పొందిన వారిలో రవీంద్రరెడ్డి, జి.రామక్రిష్ణ రావు, ఎ.సుధాకర్ రెడ్డి, ఇ.జితేందర్ రెడ్డి, ఆర్.శశిధరాచారి, మంగళదీప్తి, పి.నయనార్, వి.అమర్ నాయక్, ఆర్.ఏడుకొండలు, ఎస్.రజని, కె.రవి, సీహెచ్.రాజాక్రిష్ణ, టి.శ్రీనివాస్ ఉన్నారు. వీరితో పాటు మరో 31 మంది కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి పొందినట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.