ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం.వీ. రమణారెడ్డి కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి బుధవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రమణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన  రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఎంవీ రమణారెడ్డి నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించేవారని, […]

Update: 2021-09-28 22:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి బుధవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రమణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఎంవీ రమణారెడ్డి నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించేవారని, రాజకీయంగా అనేక పార్టీలు మారినా అది సీమకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనేని చెప్పేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Tags:    

Similar News