నా దేశానికి హెల్ప్ చేయండి.. యూఎస్‌కు ప్రియాంక రిక్వెస్ట్
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, యూఎస్ గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇండియా కొవిడ్ – 19తో సఫర్ అవుతోందని, పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలిపింది. యూఎస్ అవసరమైన దాని కంటే 550 మిలియన్ ఎక్కువ వ్యాక్సిన్స్ ఆర్డర్ చేసిందన్న ప్రియాంక.. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న భారత్‌తో వ్యాక్సిన్లు షేర్ చేసుకోవాలని కోరింది. అయితే ఈ ట్వీట్‌పై మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. స్టార్స్ అందరూ ఇప్పటికే తమ […]
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, యూఎస్ గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇండియా కొవిడ్ – 19తో సఫర్ అవుతోందని, పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలిపింది. యూఎస్ అవసరమైన దాని కంటే 550 మిలియన్ ఎక్కువ వ్యాక్సిన్స్ ఆర్డర్ చేసిందన్న ప్రియాంక.. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న భారత్‌తో వ్యాక్సిన్లు షేర్ చేసుకోవాలని కోరింది. అయితే ఈ ట్వీట్‌పై మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. స్టార్స్ అందరూ ఇప్పటికే తమ సాయాన్ని అందిస్తుంటే.. నువ్వు ఇప్పుడే మేల్కొన్నావా! అంటూ కొందరు విమర్శించారు. ఈ ట్వీట్ ఎట్ లీస్ట్ 2 వీక్స్ ముందు వస్తే బాగుండేదన్నారు. దేశం గురించి ఆలోచించి ఉంటే వాక్స్ లైవ్ క్యాంపెనియన్ టైమ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఉండేదానివి కాదని ఫైర్ అయ్యారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఇష్యూ మీద యూఎస్‌తో మాట్లాడేందుకు గట్స్ ఉండాలని, తనను చూస్తే గర్వంగా ఉందని చెప్తున్నారు.
Thank you for using your voice to fight for vaccine equity, Priyanka. @POTUS, @WHCOS, @SecBlinken, and @JakeSullivan46 — will you donate the unused AZ doses to India ASAP? The people of India need support urgently. https://t.co/4X25Oi2UFT
— Global Citizen (@GlblCtzn) April 26, 2021