మహిళలకు పవర్‌ఫుల్ పాత్రలు దక్కాలి : ప్రియాంక

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో నిండి ఉంది. ప్రతీ శనివారం రోజున, ఆ వారం మొత్తంలో తనను ఇన్‌స్పైర్ చేసిన వాటి గురించి పోస్ట్‌లు పెడుతూ ఫాలోవర్స్‌ను సైతం ఇన్‌స్పైర్ చేయడం ప్రియాంకకు అలవాటు. కాగా, ఈ వారం కూడా అలాంటి విషయాలతో పాటు తన న్యూ హెయిర్ స్టైల్ గురించి షేర్ చేసుకుంది ప్రియాంక. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన తను లేటెస్ట్‌గా […]

Update: 2020-09-12 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో నిండి ఉంది. ప్రతీ శనివారం రోజున, ఆ వారం మొత్తంలో తనను ఇన్‌స్పైర్ చేసిన వాటి గురించి పోస్ట్‌లు పెడుతూ ఫాలోవర్స్‌ను సైతం ఇన్‌స్పైర్ చేయడం ప్రియాంకకు అలవాటు. కాగా, ఈ వారం కూడా అలాంటి విషయాలతో పాటు తన న్యూ హెయిర్ స్టైల్ గురించి షేర్ చేసుకుంది ప్రియాంక. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన తను లేటెస్ట్‌గా హెయిర్ కట్ చేయించుకున్నట్లు తెలిపింది. ఈ లుక్‌లో సూపర్ క్రేజీగా ఉన్న భామ.. నెటిజన్లను ఫిదా చేసింది.

ఇక ఎప్పుడూ ఉమెన్ పవర్ గురించి మాట్లాడే ప్రియాంక.. ఓ ఇంటర్వ్యూలో మహిళా శక్తి గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. హాలీవుడ్‌లో మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే.. మహిళలను పవర్‌ఫుల్ రోల్స్ లోకి నెట్టడం అవసరమని, మనం ఉండాల్సిన స్థానానికి చేరుకునేందుకు ఏకైక మార్గం అదేనని తెలిపింది. మహిళలు మార్పు వైపు అడుగులు వేసినప్పుడే, చరిత్ర తయారవుతుందని చెప్పే ప్రియాంక.. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతోంది. ఇందుకోసం సపోర్ట్ చేసేందుకు తను కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్తోంది.

Tags:    

Similar News