నల్లగా ఉంటే తప్పేంటి.. అందంగానే ఉన్నా కదా : హీరోయిన్
దిశ, సినిమా: జాతీయ అవార్డు గెలుచుకున్న నటే కాదు.. గార్జియస్ లుక్స్, సెక్స్ అప్పీల్‌తో నేచురల్ బ్యూటీని తలపించే ప్రియమణి కూడా బాడీ టోన్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్నట్టు రివీల్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ వైఫ్ రోల్ ప్లే చేసిన ఈ బెంగళూరు బ్యూటీ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలపై చాలామంది కామెంట్స్ చేసారని తెలిపింది. ఇలాంటి విమర్శలను అనేకసార్లు విన్నానన్న ప్రియ.. తన బరువు […]
దిశ, సినిమా: జాతీయ అవార్డు గెలుచుకున్న నటే కాదు.. గార్జియస్ లుక్స్, సెక్స్ అప్పీల్‌తో నేచురల్ బ్యూటీని తలపించే ప్రియమణి కూడా బాడీ టోన్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్నట్టు రివీల్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ వైఫ్ రోల్ ప్లే చేసిన ఈ బెంగళూరు బ్యూటీ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలపై చాలామంది కామెంట్స్ చేసారని తెలిపింది. ఇలాంటి విమర్శలను అనేకసార్లు విన్నానన్న ప్రియ.. తన బరువు 65 కిలోలకు చేరినప్పుడు ఇప్పటి కన్నా లావుగా కనిపించేదాన్నని చెప్పింది. ఆ టైమ్‌లో ‘లావుగా, ఎక్కువ వయసున్నదానిలా కనిపిస్తున్నావ్’ అనేవారని గుర్తుచేసుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ ‘ఇంత సన్నగా అయిపోయావ్.. లావుగా ఉన్నప్పుడే బాగున్నావ్’ అంటున్నారని, అసలు తనను ఎలా ఉండాలనుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లను ఉండనీయకుండా బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడింది.
ఈ క్రమంలో ‘మీ ఫేస్ తెలుపే అయినా, కాళ్లు మాత్రం నల్లగా ఉన్నాయి’ అనే కామెంట్స్ వినిపిస్తుంటాయని.. అసలు నల్లగా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నించింది. అయినా తను చామనచాయలో ఉంటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి విమర్శలు చేసేవారు ముందు తమ ఒపీనియన్స్ మార్చుకోవాలని, ఎవరినీ బ్లాక్ అని పిలవకూడదని సూచించింది. కృష్ణుడు నల్లగా ఉన్నా, అందంగానే ఉన్నాడు కదా! మరి కలర్ టోన్ గురించి ఎందుకంతగా నెగెటివిటీ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం ఫేమ్ కోసం ఈ తరహా ట్రోలింగ్ చేస్తే, అది చాలామంది జీవితాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.