ఆర్థిక ఇబ్బందులతోనే ప్రైవేట్​ టీచర్ ఆత్మహత్య

దిశ, న్యూస్​బ్యూరో : ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేటు మహిళా ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోడుప్పల్​లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్​లో పనిచేస్తున్న శివాణి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. శివాణి గత ఐదేండ్లుగా కిరణ్​ ఇంటర్నేషనల్​ స్కూల్​లో పనిచేస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఇంటి అద్దె చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నాలుగు నెలలుగా జీతాలు కూడా రావడం లేదు. దీంతో ఆర్థిక సమస్యల ఒత్తిడి పెరుగుతోందని శివాణి ఆత్మహత్యకు […]

Update: 2020-08-09 12:24 GMT

దిశ, న్యూస్​బ్యూరో : ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేటు మహిళా ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోడుప్పల్​లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్​లో పనిచేస్తున్న శివాణి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. శివాణి గత ఐదేండ్లుగా కిరణ్​ ఇంటర్నేషనల్​ స్కూల్​లో పనిచేస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఇంటి అద్దె చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నాలుగు నెలలుగా జీతాలు కూడా రావడం లేదు. దీంతో ఆర్థిక సమస్యల ఒత్తిడి పెరుగుతోందని శివాణి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

కాగా మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని టీపీటీఎఫ్​ డిమాండ్​ చేసింది.
విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని తెలంగాణ ప్రైవేట్​ టీచర్స్​ ఫోరం నాయకుడు శబ్బీర్​ అలీ డిమాండ్ చేశారు. లాక్​డౌన్​లో జీతాలు లేక ప్రైవేటు టీచర్లు పడుతున్న ఇబ్బందులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా శివాణి ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శివాణి ఆత్మహత్యకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల చేపడుతామని ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News