ప్రైవేట్ స్కూల్స్ భవనాల్లో కరోనా చికిత్స
దిశ,న్యూస్‌బ్యూరో: కరోనా వైద్యానికి ప్రైవేటు స్కూల్స్ భవనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ స్కూల్ భవనాలను ఉపయోగించుకోవాలని ట్రస్మా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ […]
దిశ,న్యూస్‌బ్యూరో: కరోనా వైద్యానికి ప్రైవేటు స్కూల్స్ భవనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ స్కూల్ భవనాలను ఉపయోగించుకోవాలని ట్రస్మా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ( ట్రస్మా ) చేయుతనందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న కూలీలు, వలస కార్మికులు, అన్నార్థులకు ఉచితంగా భోజనాలు పెట్టేందుకు ట్రస్మా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్‌లోని హాస్టళ్లలో బెడ్స్, వంట సామగ్రి ఉన్నాయని, సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారని ట్రస్మా ప్రతినిధులు తెలిపారు.
Tags: coronavirus, medicin, building,hostels,trusma,labor, lockdown