జిల్లా ఉద్యోగుల‌కు ప్రైవేట్ హెల్త్ కార్డులు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అనారోగ్యానికి గురైన హైద‌రాబాద్ జిల్లా ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌లో వైద్యం పొందేందుకు వీలుగా ప్రైవేట్ ఇన్సురెన్స్ సంస్థ‌ల‌తో హెల్త్ కార్డులు ఇప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు టీఎన్జీవో జిల్లా అధ్య‌క్షుడు ముజీబ్ హుసేనీ తెలిపారు. శుక్రవారం నాంప‌ల్లిలోని టీఎన్జీవో కార్యాల‌యంలో సమావేశంల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జె.బాలరాజ్, ప్రభాకర్, నరేష్ కుమార్, జగన్ కుమార్, సదానంద్, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు కార్పొరేట్ […]

Update: 2020-10-16 09:05 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్:
అనారోగ్యానికి గురైన హైద‌రాబాద్ జిల్లా ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌లో వైద్యం పొందేందుకు వీలుగా ప్రైవేట్ ఇన్సురెన్స్ సంస్థ‌ల‌తో హెల్త్ కార్డులు ఇప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు టీఎన్జీవో జిల్లా అధ్య‌క్షుడు ముజీబ్ హుసేనీ తెలిపారు. శుక్రవారం నాంప‌ల్లిలోని టీఎన్జీవో కార్యాల‌యంలో సమావేశంల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జె.బాలరాజ్, ప్రభాకర్, నరేష్ కుమార్, జగన్ కుమార్, సదానంద్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో చెల్లుబాటు కాకపోవ‌డంతో ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి అవ‌స‌ర‌మైన న‌గ‌దు చేతిలో లేక‌పోవ‌డంతో వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గుర్తించి ప్రైవేట్ ఇన్సురెన్స్ సంస్థ‌ల‌తో హెల్త్ కార్డులు ఇప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. దీనికోసం న‌లుగురు స‌భ్యులు పి.విజ‌య్ భాస్క‌ర్, ఉమ‌ర్ ఖాన్, జ్ఞానేంద్ర బాబు, ఎస్.ముర‌ళీ రాజ్‌ల‌తో ఓ క‌మిటీ వేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

Tags:    

Similar News