కూతురి స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్న హీరో..

దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాదు నిర్మాతగాను సక్సెస్ అందుకున్నారు. ‘లూసిఫర్’ ద్వారా డైరెక్టర్‌గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తన సెకండ్ డైరెక్టోరియల్ వెంచర్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఏడేళ్ల కూతురు అలంకృత రాసిన స్క్రిప్ట్‌ బేస్ చేసుకుని రెండో సినిమా ఉండబోతుందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా షేర్ చేశాడు. ‘ తండ్రి కొడుకులు అమెరికాలో నివసిస్తుంటారు. […]

Update: 2021-06-18 03:11 GMT

దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాదు నిర్మాతగాను సక్సెస్ అందుకున్నారు. ‘లూసిఫర్’ ద్వారా డైరెక్టర్‌గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తన సెకండ్ డైరెక్టోరియల్ వెంచర్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఏడేళ్ల కూతురు అలంకృత రాసిన స్క్రిప్ట్‌ బేస్ చేసుకుని రెండో సినిమా ఉండబోతుందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా షేర్ చేశాడు. ‘ తండ్రి కొడుకులు అమెరికాలో నివసిస్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో వారిద్దరిని రెఫ్యూజీ క్యాంప్‌కు తరలిస్తారు అధికారులు. అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉన్న తండ్రీ కొడుకులు వార్ ముగియడంతో తిరిగి ఇంటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంటారు ది ఎండ్’ అని కూతురు రాసిన స్క్రిప్ట్ చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానని, లాక్‌ డౌన్‌లో తాను విన్న బెస్ట్ స్టోరీ లైన్ ఇదేనని, కానీ కరోనా మహమ్మారి సమయంలో చిత్రీకరించడం అసంభవమని మరో సినిమా ఎంచుకున్నట్లు చెప్పాడు. కానీ, ఇప్పుడు మళ్లీ కెమెరా వెనకాలకు వెళ్లాలని ఉందంటూ.. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయగానే డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుని షూటింగ్ మొదలుపెడతానని తెలిపాడు.

Tags:    

Similar News