160 మంది ఖైదీలకు పాజిటివ్

లక్నో: ఉత్తరప్రదేశ్ జైళ్లల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. బాలియా డిస్ట్రిక్ట్ జైలులో 160 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ తేలింది. 594 మంది ఖైదీల నమూనాలను వైద్యాధికారుల బృందం సేకరించిందని, ఇందులో ఒక మహిళా ఖైదీ సహా 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని జైలు సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మౌర్య తెలిపారు. పాజిటివ్ తేలిన ఖైదీలందరినీ ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెడిసిన్స్, ఇతర అవసరాలను అందజేస్తున్నారని వివరించారు. కాగా, ఆ మహిళా […]

Update: 2020-07-24 07:44 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్ జైళ్లల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. బాలియా డిస్ట్రిక్ట్ జైలులో 160 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ తేలింది. 594 మంది ఖైదీల నమూనాలను వైద్యాధికారుల బృందం సేకరించిందని, ఇందులో ఒక మహిళా ఖైదీ సహా 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని జైలు సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మౌర్య తెలిపారు. పాజిటివ్ తేలిన ఖైదీలందరినీ ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెడిసిన్స్, ఇతర అవసరాలను అందజేస్తున్నారని వివరించారు. కాగా, ఆ మహిళా ఖైదీని బసంత్‌పుర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఝాన్సీ జిల్లా జైలులోనూ 120 మంది ఖైదీలకు బుధవారం పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News