అన్నింటీకి రెడీ అంటున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాప్రయోజనాలు లేని అంశాలు లేవనెత్తి సభా సమయాన్ని వృథా చేయవద్దని, నిబంధనల ప్రకారం ఏ టాపిక్ తెచ్చినా అందుకు సమ్మతమేనని తెలిపారు. అన్నింటికి తమ ప్రభుత్వం సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి సూచనలూ ఆలకిస్తామని, అధికార, ప్రతిపక్ష ఎంపీల సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. సోమవారం పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం […]

Update: 2021-07-18 05:52 GMT

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాప్రయోజనాలు లేని అంశాలు లేవనెత్తి సభా సమయాన్ని వృథా చేయవద్దని, నిబంధనల ప్రకారం ఏ టాపిక్ తెచ్చినా అందుకు సమ్మతమేనని తెలిపారు. అన్నింటికి తమ ప్రభుత్వం సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి సూచనలూ ఆలకిస్తామని, అధికార, ప్రతిపక్ష ఎంపీల సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. సోమవారం పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.

ఈ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో చర్చపై చట్టసభ్యులతో మాట్లాడినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. బిల్లులపై చర్చ పెట్టకుండా ఆమోదించుకోవాలనే ఆతృతలో ప్రభుత్వం లేదని, అన్నింటిపై కూలంకశంగా మాట్లాడటానికి రెడీగా ఉన్నదని తెలిపారు. ఈ భేటీలో 33కుపైగా పార్టీల ఫ్లోర్ లీడర్‌లు పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పియూశ్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతోపాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఫ్లోర్ లీడర్ డెరెక్ ఓబ్రియన్, డీఎంకే నేత తిరుచి శివ, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా, ఎన్‌డీఏ మిత్రపక్షాలు అప్నా దళ్ నేత అనుప్రియా పటేల్, ఎల్‌జేపీ నేత పశుపతి పరాస్‌ సహా పలువురు నేతలు అఖిలపక్ష భేటీలో హాజరయ్యారు.

Tags:    

Similar News