అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ స్వర్ణ విజయ స్యోతిని వెలిగించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగిస్తారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు. ఈ విజయ జ్యోతులను 1971 యుద్ధంలో పాల్గొని అవార్డులందుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ స్వర్ణ విజయ స్యోతిని వెలిగించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగిస్తారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు.
ఈ విజయ జ్యోతులను 1971 యుద్ధంలో పాల్గొని అవార్డులందుకున్న జవాన్ల గ్రామాలకు పంపేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ఏడాది పాటు స్వర్ణ విజయ సంబరాలు నిర్వహించనున్నారు.