‘జీవితంలో ఒక్కసారైన అయోధ్యలో పర్యటించాలని అనిపించాలి’
న్యూఢిల్లీ: భావితరాలను దృష్టిలో పెట్టుకుని అయోధ్యపురిని నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించారు. తమ జీవితంలో ఒక్కసారైనా అయోధ్యకు వెళ్లిరావాలన్న కాంక్ష వారిలో కలిగేలా పట్టణం ఉండాలని అన్నారు. భారత సంప్రదాయాలు, వారసత్వ విలువలు ప్రతిబింబించాలని తెలిపారు. కేవలం భక్తులకే కాదు, పర్యాటకులకూ అనువైన కేంద్రంగా నిర్మించాలని చెప్పారు. అయోధ్య పట్టణ అభివృద్ధి ప్రణాళికను ప్రధాని శనివారం సమీక్షించారు. అయోధ్యను ఆధ్యాత్మిక కేంద్రంగా, గ్లోబల్ టూరిస్ట్ స్పాట్‌గా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు […]
న్యూఢిల్లీ: భావితరాలను దృష్టిలో పెట్టుకుని అయోధ్యపురిని నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించారు. తమ జీవితంలో ఒక్కసారైనా అయోధ్యకు వెళ్లిరావాలన్న కాంక్ష వారిలో కలిగేలా పట్టణం ఉండాలని అన్నారు. భారత సంప్రదాయాలు, వారసత్వ విలువలు ప్రతిబింబించాలని తెలిపారు. కేవలం భక్తులకే కాదు, పర్యాటకులకూ అనువైన కేంద్రంగా నిర్మించాలని చెప్పారు. అయోధ్య పట్టణ అభివృద్ధి ప్రణాళికను ప్రధాని శనివారం సమీక్షించారు. అయోధ్యను ఆధ్యాత్మిక కేంద్రంగా, గ్లోబల్ టూరిస్ట్ స్పాట్‌గా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు ప్రధానికి వివరించారు. అయోధ్యతో కనెక్ట్ అయ్యే వసతుల వివరాలను తెలిపారు.
ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ విస్తరణ, బస్ స్టేషన్, రోడ్లు అభివృద్ధిపై మాట్లాడారు. భావితరాలకు అనుగుణంగా నిర్మించాలని, కాబట్టి, ఒక అడుగు ముందు వేసి తగిన అభివృద్ధి పనులు ఇప్పుడే మొదలుపెట్టాలని, అయోధ్య అస్తిత్వాన్ని చిరకాలం నిలపడం అందరి బాధ్యత అని ప్రధాని వివరించారు. అందుకు యువత నైపుణ్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.