కేదార్‌నాథ్ టెంపుల్ ఎదుట పురోహితుడి వింత నిరసన..

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుపై పురోహిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పురోహితుడు ఆచార్య సంతోశ్ త్రివేది బుధవారం కేదార్‌నాథ్ ఆలయం ఎదుట శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. ఇలా వారంపాటు నిరసన చేస్తారని, అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ బోర్డు దేవస్థానం బోర్డు రద్దు చేయకుంటే నిరసన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. చాలా మంది పురోహితులు బోర్డును రద్దు చేయాలని మౌన దీక్ష చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా […]

Update: 2021-06-16 09:16 GMT

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుపై పురోహిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పురోహితుడు ఆచార్య సంతోశ్ త్రివేది బుధవారం కేదార్‌నాథ్ ఆలయం ఎదుట శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. ఇలా వారంపాటు నిరసన చేస్తారని, అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ బోర్డు దేవస్థానం బోర్డు రద్దు చేయకుంటే నిరసన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. చాలా మంది పురోహితులు బోర్డును రద్దు చేయాలని మౌన దీక్ష చేస్తున్నారు.

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని పున:పరిశీలిస్తానని తీరథ్ సింగ్ రావత్ హామీనిచ్చారని కేదార్‌నాథ్ తీర్థ పురోహిత్ సమాజ్ తెలిపింది. తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పున:పరిశీలించడాన్ని పక్కనపెట్టి విస్తరించే నిర్ణయాన్ని తీసుకున్నారని, దీన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించింది.

Tags:    

Similar News